Karthika Deepam2 : ఆ ఇంటికి వెళ్ళిన దీప.. తాళి తీసేయమన్న జ్యోత్స్న!
on Oct 22, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం '(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -181 లో......దీప బాధపడుతూ ఉంటే కార్తీక్ వస్తాడు కార్తీక్ చేసిన పనికి దీప చాలా కోపంగా ఉంటుంది. శౌర్య నాన్న కావాలని అడిగింది. దాంతో అలా చేశానని కార్తీక్ అంటాడు. అది చిన్న పిల్ల దానికేం తెలుసని దీప అంటుంది. అది మళ్ళీ ఆ నర్సింహా వస్తాడని బయపడుతుందని కార్తీక్ అనగానే.. భయపడితే ఏంటని దీప అంటుంది. చచ్చిపోతుందని కార్తీక్ అనగానే.. దీప షాక్ అవుతుంది. ఏంటని దీప అడుగుగా.. ఏం లేదని కార్తీక్ డైవర్ట్ చేస్తాడు.
నీకు భర్తని అవ్వాలని ఆ తాళి కట్టలేదు.. కేవలం శౌర్యకి నాన్న కావాలని మాత్రమే చేసానని కార్తీక్ అంటాడు. దీన్ని ఎవరు మార్చలేరని కార్తీక్ అంటాడు. దీప తులసి చెట్టు దగ్గర దీపం పోతుంటే దీప చేతులు ఆడ్డు పెట్టి ఆపుతుంది. అది చూసి దీపం కోసం అలా చేసావ్.. ఒక పసిదాని కోసం ఇలా చేసానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత సుమిత్ర ఇంటికి దీప వెళ్ళాలనుకుంటుంది. ఆ తర్వాత దీపకి అనసూయ కాఫీ తీసుకొని వస్తుంది. వచ్చేసరికి దీప ఉండదు. దాంతో మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందంటూ శౌర్య ఏడుస్తుంది. దీపకి కార్తీక్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవదు. ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసని కార్తీక్ అంటాడు.
ఆ తర్వాత ఇంత మోసం చేసిన దీపని వెళ్లి అడగండి అని శివన్నారాయణతో పారిజాతం అంటుంది. అవసరం లేదు దాని కోసం ఆ ఇంట్లో అడుగుపెట్టలేను. దాన్ని ఈ ఇంట్లో అడుగుపెట్టనివ్వనని శివన్నారాయణ అంటాడు. అప్పుడే దీప వస్తుంది. ఎందుకు వచ్చావంటూ పారిజాతం తిడుతుంది. నా తప్పేం లేదని చెప్పడానికి వచ్చానని దీప అంటుంది. అయితే ఆ తాళి తీసేయ్ అంటూ జ్యోత్స్న అనగానే అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు నువ్వు ఈ దీపతో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయ్ మమ్మీ .. మీ ఎమోషనల్ చూస్తుంటే దీపనే మీ కూతురు అనేలా ఉన్నాయని సుమిత్రతో జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read